
ఉక్రెయిన్ చిన్నారుల కోసం వేలం వేసిన రష్యా జర్నలిస్టు దిమిత్రి
న్యూయార్క్: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా లక్షలాది మంది ఉక్రెనియన్లు వలసెళ్లిపోయారు. వీరిలో చిన్నారులు కూడా ఉన్నారు. వారు పడుతున్న బాధలను ప్రత్యక్షంగా చూసిన రష్యా జర్నలిస్ట్ దిమిత్రి మురతోవ్సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2021 ఏడాదికిగాను తనకిచ్చిన నోబెల్ శాంతి బహుమతిని వేలం వేశారు. రికార్డు స్థాయిలో 103.50 మిలియన్ డాలర్లు(దాదాపుగా రూ.809 కోట్లు) వచ్చాయి. వీటిని శరణార్థులుగా మారిన ఉక్రెయిన్ చిన్నారుల కోసం ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. యూనిసెఫ్ ఆధ్వర్యంలో సాయం చేస్తానని మురతోవ్ చెప్పారు. ఇంత భారీ మొత్తం నిధులు వస్తాయని అస్సలు ఊహించలేదని మురతోవ్ తెలిపారు.