ములుగు, వెలుగు : ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జనరేటర్లు పనిచేయడం లేదు. ఆస్పత్రిలో మూడు జనరేటర్లు ఉన్నా మూడు నెలలుగా నిరుపయోగంగా ఉండటంతో పవర్ కట్ సమయంలో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆస్పత్రిలో ఇన్వార్డులో ఉండే రోగులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఐసీయూతోపాటు ఎమర్జెన్సీ వార్డుల్లో సైతం అవస్థలు పడుతున్నారు. ఈ విషయంపై స్థానికులు వైద్య అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
