అమెరికా చేతిలో గుటెర్రస్ కీలుబొమ్మ

అమెరికా చేతిలో గుటెర్రస్ కీలుబొమ్మ

నార్త్​ కొరియా విదేశాంగ మంత్రి

సియోల్: యూఎన్ సెక్రెటరీ జనరల్ ఆంటోని యో గుటెర్రస్ అమెరికా చేతిలో కీలుబొమ్మగా వ్యవహరిస్తున్నారని నార్త్ కొరియా మండిపడింది. ఇటీవల నార్త్ కొరియా ఐసీబీఎంను విజయవంతంగా ప్రయోగించింది. అమెరికా ఖండంలోని ఏ ప్రాంతంలోని టార్గెట్​ను అయినా ఛేదించగల సామర్థ్యం ఈ మిసైల్​ సొంతం. ఈక్రమంలో నార్త్ కొరియా మిసైల్​ ప్రయోగంపై గుటెర్రస్​ స్పందిస్తూ.. రెచ్చగొట్టే విధంగా ఎలాంటి చర్యలను నార్త్ కొరియా తీసుకోరాదని కామెంట్​ చేశారు.

దీనిపై నార్త్ కొరియా విదేశాంగ మంత్రి చోయ్ సోన్ హ్యూ మాట్లాడుతూ.. అమెరికా, దాని మిత్రదేశాల చర్యలను పట్టించుకోకుండా నార్త్​ కొరియా మిసైల్​ టెస్టులను తప్పుబట్టడంచూస్తే గుటెర్రస్ అమెరికా చేతిలో కీలుబొమ్మగా మారినట్లు తెలుస్తోందని సోన్ హ్యూ విమర్శించారు.