
హైదరాబాద్, వెలుగు: ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఇండియా ఫస్ట్ లైఫ్), బ్యాంక్ ఆఫ్ బరోడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ, నార్తర్న్ ఆర్క్ క్యాపిటల్‌తో వ్యూహాత్మక కార్పొరేట్ ఏజెన్సీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా నార్తర్న్ ఆర్క్ క్యాపిటల్ తమ ఖాతాదారులకు ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులను అందించనుంది.
ఇందులో టర్మ్ ఇన్సూరెన్స్, సేవింగ్స్ ప్లాన్లు, రిటైర్మెంట్ ప్రొడక్ట్స్, గ్రూప్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులు ఉంటాయి. ఈ భాగస్వామ్యం ఆర్థిక సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు చేర్చుతుందని ఇండియా ఫస్ట్ లైఫ్ సీఈఓ రుషభ్ గాంధీ అన్నారు. జీవన భద్రత ఉత్పత్తులను సులభంగా అందించడమే కాకుండా, దేశవ్యాప్తంగా జీవిత బీమాను పెంచడంలో ఒక మైలురాయి అవుతుందని అన్నారు.