
స్టావాంజాలో జరుగుతున్న నార్వే చెస్ ఈవెంట్ లో తెలుగు బిడ్డ, ప్రపంచ ఛాంపియన్ డి.గుకేష్ సత్తాచాటుతున్నాడు. గుకేష్ దెబ్బకు ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన కార్ల్ సన్ సహనం కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆదివారం ( జూన్1) న స్టావాంజాలో జరిగిన నార్వే చెస్ ఈవెంట్ లో ఓటమి తర్వాత బల్లను బద్దలు కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
OH MY GOD 😳🤯😲 pic.twitter.com/QSbbrvQFkE
— Norway Chess (@NorwayChess) June 1, 2025
ఈవెంట్ ఆరో రౌండ్‌లో మొదటిసారిగా క్లాసికల్ గేమ్‌లో కార్ల్‌సెన్‌ను ఆశ్చర్యపరిచే ఎత్తులతో గుకేష్ చిత్తు చేశాడు. వరుస విజయాలతో ఊపులో ఉన్న గుకేష్ కార్ల్సన్పై విజయం సాధించి అతనికి షాకిచ్చాడు. ఆటలో ఎక్కువ భాగం ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ గుకేష్ టైమ్ స్క్రాంబుల్ సమయంలో కార్ల్‌సెన్ చేసిన అరుదైన తప్పిదాన్ని సద్వినియోగం చేసుకుని నాలుగు గంటలకు పైగా సాగిన సుదీర్ఘ ఆట తర్వాత 62 స్టెప్పులలో పైచేయి సాధించాడు.టోర్నమెంట్‌లో 8.5 పాయింట్లతో మూడో స్థానానికి ఎగబాకాడు.
అయితే గుకేష్ చేతిలో ఓటమి పాలైన కార్ల్ సన్ సహనం కోల్పోయాడు.తన నిరాశను బహిరంగంగానే వ్యక్తం చేశాడు. నిరాశలో టేబుల్ పై కొట్టాడు.. మీడియాతో మాట్లాడకుండా వేదిక దిగి వెళ్లిపోయాడు. కార్ల్ సన్ నిరాశ వ్యక్తం చేసిన తీరుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇక గుకేష్ విజయంపై కార్ల్ సన్ కోచ్ గ్ర్జెగోర్జ్ గజెవ్స్కీ కూడా ప్రశంసలు కురిపించారు.ఈ విజయం ప్రాముఖ్యతను తెలిపాడు. మిగతా టోర్నీలో ఆటల్లో కార్ల్సన్తో జరిగే మ్యాచ్ లపై మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని తెలిపారు.
స్టావాంజోలో జరుగుతున్న నార్వే చెస్ టోర్నమెంట్ లో తీవ్ర పోటీతో కొనసాగుతోంది. గుకేష్ విజయంతో అగ్రస్థానం కోసం పోటీ పడుతున్నారు. వరల్డ్ చాంపియన్ డి.గుకేశ్ నార్వే చెస్ టోర్నీలో శుక్రవారం వరుసగా రెండో విజయం అందుకున్నాడు. శుక్రవారం జరిగిన నాలుగో రౌండ్‌లో అమెరికా గ్రాండ్‌మాస్టర్ ఫాబియానో కరువానాపై ఆర్మగెడాన్ టై-బ్రేక్‌లో థ్రిల్లింగ్ విజయం సాధించాడు. ప్రస్తుతం గుకేశ్ మూడో స్థానంలో ఉన్నారు.