
తవాంగ్: చైనాకు అరుణాల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో ఉన్న మఠ సన్యాసులు వార్నింగ్ ఇచ్చారు. ఇది 1962 కాదని, 2022 అని, ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ జమనా అని పేర్కొన్నారు. ‘‘ప్రధాని మోడీ ఎవ్వరినీ విడిచిపెట్టరు. మేము మోడీ ప్రభుత్వానికి, ఇండియన్ ఆర్మీకి మద్దతు ఇస్తున్నాం. చైనా ప్రభుత్వం ఎప్పుడూ ఇతర దేశాల భూ భాగాలను ఆక్రమించుకోవాలని చూస్తుంటుంది. అందులో భాగంగానే ఇండియా భూ భాగంపై కన్నేసింది. ఇది తప్పు. ప్రపంచంలో శాంతి కావాలంటే ఇలాంటి పనులను చైనా మానుకోవాలి”అని తవాంగ్‌లో ఉన్న మఠం సన్యాసి లామా యేషి ఖావో హితవు పలికారు.
మోడీ ప్రభుత్వంపై, ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో తవాంగ్ సెక్టార్ సెఫ్‌గా ఉంటుందని చెప్పారు. కాగా, 1962లో చైనా, ఇండియా మధ్య జరిగిన యుద్ధం సమయంలో ఈ మఠంలోని సన్యాసులు ఇండియన్ ఆర్మీకి సాయం చేశారని గుర్తుచేశారు. ఆ సమయంలో చైనా ఆర్మీ కూడా ఈ మఠంలోకి వచ్చిందని, కానీ, సన్యాసులకు ఎలాంటి ప్రమాదం తలపెట్టలేదని చెప్పారు. ‘‘ఇంతకుముందు తవాంగ్ టిబెట్‌లో అంతర్భాగంగా ఉండేది. ప్రస్తుతం టిబెట్‌ను చైనా స్వాధీనం చేసుకుంది. దీంతో తవాంగ్ కూడా తమదే అని చైనా ప్రభుత్వం వాదిస్తోంది. కానీ, తవాంగ్ ఇండియాకు చెందిన భూ భాగమే. బార్డర్‌లో ఇండియన్ ఆర్మీ ఉందన్న ధైర్యంతో ఇక్కడ మేము ప్రశాంతంగా ఉంటున్నాం”లామా యేషి ఖావోఅని అన్నారు.