చిరుత కాదు హైనా?.. ఇంకా వీడని మిస్టరీ

చిరుత కాదు హైనా?.. ఇంకా వీడని మిస్టరీ

షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా కొత్తూరులో చిరుత కలకలంపై మిస్టరీ వీడలేదు. రెండ్రోజుల కిందట కొత్తూరులో దూడలపై దాడి చేసిన చంపినది చిరుత కాదని.. హైనా అయి ఉండొచ్చని ఫారెస్ట్ అధికారులు అనుమానిస్తున్నారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో రెండు దూడలు చనిపోయాయి. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు మంగళవారం ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిరుత దాడికి, హైనా చేసే దాడికి తేడా ఉంటుందని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రవీందర్ తెలిపారు. రైతులు జాగ్రత్తగా ఉండాలన్నారు. 

చేవెళ్లలో మళ్లీ పులి కలకలం

చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ముడిమ్యాల గ్రామ శివారులో మళ్లీ పులి కనిపించిదంటూ గ్రామస్తులు తెలిపారు. మంగళవారం రాత్రి ముడిమ్యాల చెరువు కట్ట దగ్గర పులి తిరుగుతుందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. వారం రోజులుగా ముడిమ్యాలలో పులి తిరుగుతోందంటూ గ్రామస్తులు చెబుతున్నారు. ​