చేదస్తం కాకపోతే : ఉపవాసం ఉండలేదని.. భార్యకు విడాకులు

చేదస్తం కాకపోతే : ఉపవాసం ఉండలేదని.. భార్యకు విడాకులు

కర్వా చౌత్​ లో సాధారణంగా ఉపవాసం ఉంటారు.   ఉపవాసం ఉండలేదనే కారణంగా విడాకులు కావాలని ఓభర్త కోర్టును ఆశ్రయించాడు.  కోర్టు విడాకులు మంజూరు చేస్తూ.. ఉపవాసం అనేది వ్యక్తిగత ఇష్టమంటూ.. భార్య అనుచితంగా ప్రవర్తనతో భర్త విసిగిపోయాడనే కారణంగా ఢిల్లీ హైకోర్టు విడాకులు మంజూరు చేసింది.

వివరాల్లోకి వెళ్తే... 

కర్వా చౌత్ లో ఓ జంటకు 2009లో వివాహం అయింది.  వీరి దాంపత్య జీవితంలో 2011లో ఒక కుమార్తె కలిగింది.పెళ్లయిన దగ్గరి నుంచి  భార్య ప్రవర్తన ఉదాసీనంగా ఉండి కుంటుండ బాధ్యతలను నిర్వహించేందుకు ఆశక్తి చూపించలేదని  మరియు ఆమె వివాహ బాధ్యతలను నిర్వర్తించడంలో ఆమెకు ఆసక్తి లేదు. అంతే కాకుండా  ఆమె నుదిటి నుండి వెర్మిలియన్‌ని తీసివేసి, గాజులు పగలగొట్టి, తెల్లటి సూట్ ధరించి, ఆమె వితంతువుగా మారిందని ప్రకటించింది. భార్య .. తన భర్త.. అతని వృద్ద తల్లిదండ్రులపై క్రిమినల్​ కేసు దాఖలు చేసిందని ఈ కేసులను కోర్టు సమర్దించలేకపోయిందని ఢిల్లీ హైకోర్టు తెలిపింది.  ఆ తరువాత భార్య అప్పీల్​ చేయగా ఇరు వర్గాల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు విడాకులు మంజూరు చేసింది.  

కర్వా చౌత్‌లో ఉపవాసం ఉండకపోవడం అనేది ఒక వ్యక్తి యొక్క ఇష్టమని, అది క్రూరత్వానికి సమానం కాదని లేదా వివాహ బంధాన్ని తెంచుకోవడానికి సరిపోదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది.వివిధ మత విశ్వాసాలు కలిగి ఉండటం మరియు కొన్ని మతపరమైన విధులను నిర్వర్తించకపోవడం కూడా క్రూరత్వానికి సమానం కాదని న్యాయమూర్తులు సురేష్ కుమార్ కైత్ , నీనా బన్సల్ కృష్ణలతో కూడిన డివిజన్ బెంచ్ వ్యాఖ్యానించింది.

ఓ కేసులో భర్త విడాకుల అభ్యర్థనను అనుమతించాలనే కుటుంబ న్యాయస్థానం నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది.  వాస్తవాలను  పరిశీలించిన తరువాత , భార్యకు  ఆమె  భర్త  మరియు  వైవాహిక బంధం పట్ల గౌరవం లేదని స్పష్టంగా తెలుస్తోందని తెలిపింది. క్రూరత్వం కారణంగా విడిపోయిన భర్తకు విడాకులు మంజూరు చేస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఓ మహిళ హైకోర్టులో అప్పీల్‌ చేసింది.  ఇరు వాదనలు విన్న హైకోర్టు ఫ్యామిలీ కోర్టు తీర్పును సమర్దిస్తూ  హైకోర్టు  ఈ వ్యాఖ్యలు చేసింది.