సీబీఐ సోదాలు..లాకర్లో ఏమి దొరకలేదు

సీబీఐ సోదాలు..లాకర్లో ఏమి దొరకలేదు

మద్యం పాలసీలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సంబంధించిన బ్యాంక్ లాకర్లను సీబీఐ అధికారులు తనిఖీ చేశారు. ఘజియాబాద్లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్లో సిసోడియాకు సంబంధించిన లాకర్ ను అధికారులు ఆయన ముందే ఓపెన్ చేసి చెక్ చేశారు. అయితే సీబీఐ సోదాల్లో తన ఇంట్లో, బ్యాంక్ లాకర్‌లో ఏమి దొరకలేదని మనీష్ సిసోడియా తెలిపారు. లాకర్‌లో తన పిల్లలు, భార్యకు చెందిన 70వేల విలువైన ఆభరణాలు ఉన్నట్లు చెప్పారు. 

 ఏమీ దొరకదని తెలిసినా తనను జైల్లో పెట్టడానికి ప్రధాని మోడీ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని సిసోడియా ఆరోపించారు. సోదాల సమయంలో సీబీఐ అధికారులు ఎటువంటి ఇబ్బందులు పెట్టలేదని చెప్పారు. కాగా ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీలో అవినీతి జరిగిందంటూ 15 మందిపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇందులో మొదటి నిందితుడుగా సిసోడియా పేరును సీబీఐ పేర్కొంది. ఎక్సైజ్‌ పాలసీలో  144 కోట్లు అవినీతి జరిగిందంటూ బీజేపీ ఆరోపణలు చేస్తోంది.