
లింగంపేట, వెలుగు : నాలుగేండ్లుగా బకాయిపడిన గ్రంథాలయ పన్నులు చెల్లించాలని కోరుతూ లింగంపేట శాఖ గ్రంథాలయ లైబ్రేరియన్ శ్రీనివాస్పలువురు సర్పంచులకు శనివారం నోటీసులు జారీ చేశారు. మండలంలోని 41 జీపీలలో 2019 నుంచి 2023 వరకు రూ. 8 లక్షల పన్ను బకాయిలు ఉన్నట్లు ఆయన చెప్పారు. లైబ్రరీ పన్నులను సకాలంలో చెల్లించని కారణంగా గ్రంథాలయాల నిర్వహణ కష్టంగా మారిందని ఆయన నోటీసుల్లో పేర్కొన్నారు. డిసెంబర్నెలాఖరులోగా పన్నులు చెల్లించి సహకరించాలని కోరారు.