గుర్తింపు లేని  కాలేజీల్లో అడ్మిషన్లు

గుర్తింపు లేని  కాలేజీల్లో అడ్మిషన్లు

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ గుర్తింపు లేని 92 పారామెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లకు పారామెడికల్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. గుర్తింపు లేదని ఈ కాలేజీల్లో అడ్మిషన్లకు గతంలో ఉన్న బోర్డు సెక్రటరీ నిరాకరించారు. ఆ తర్వాత వచ్చిన సెక్రటరీ ఈ కాలేజీలకు అనుకూలంగా అడ్మిషన్లకు పర్మిషన్ ఇచ్చారు. విషయం బయటకు పొక్కడంతో హెల్త్ సెక్రటరీ ఆ నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ను ఆపారు. బోర్డు సెక్రటరీగా మరో ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బాధ్యతలు ఇచ్చారు. దీంతో ఆయా కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వం వద్ద  పైరవీలు చేయడంతో పాటు, కోర్టుకెక్కాయి. కాలేజీలకు అనుకూలంగా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేయాల్సిన సర్కార్.. కాలేజీలకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ కాలేజీల్లో అడ్మిషన్లకు బోర్డు తాజాగా  నోటిఫికేషన్ విడుదల చేసింది.