స్పెషల్ పోలీస్ ఆఫీసర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

స్పెషల్ పోలీస్ ఆఫీసర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
  •  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషనరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టెంపరరీ ఉద్యోగాలకు దరఖాస్తులు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషనరేట్ పరిధిలో స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీస్ ఆఫీసర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీవో)నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. 150 ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీవోల కోసం సిటీ ఆర్మ్​డ్​ రిజర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెడ్ క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాయింట్ సీపీ సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. టెంపరరీ ప్రాతిపదికన ఈ పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. మాజీ సైనికులు, మాజీ పారామిలిటరీ, రిటైర్డ్ పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిబ్బంది ఈ పోస్టులకు అర్హులని వెల్లడించారు.

 దరఖాస్తుదారులు కచ్చితంగా తెలంగాణకు చెందిన వారై ఉండాలి. రిటైర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసులకు తెలంగాణకు చెందిన ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్డ్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. 2024 ఫిబ్రవరి 1 నాటికి 58 ఏండ్ల కంటే తక్కువ వయసు ఉండాలి. టెంపరరీ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గౌరవ వేతనం నెలకు రూ.26 వేలు చెల్లిస్తారు. సెలవులు ఉండవు. డిశ్చార్జ్ బుక్/డిశ్చార్జ్ సర్టిఫికేట్/రిటైర్మెంట్ ఆర్డర్, టెక్నికల్ ట్రేడ్ ప్రొఫిషియన్సీ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. పూర్తి డాక్యుమెంట్లతో ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా పేట్లబురుజులోని సిటీ ఆర్మ్​డ్​రిజర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెడ్ క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దరఖాస్తు చేసుకోవాలి” అని సూచించారు.