పాక్లో రాజకీయ సంక్షోభం.. ఇమ్రాన్ ఖాన్పై అవిశ్వాసం

పాక్లో రాజకీయ సంక్షోభం.. ఇమ్రాన్ ఖాన్పై అవిశ్వాసం

ఇస్లామాబాద్ : పాకిస్థాన్లో రాజకీయ సంక్షోభం ముదిరింది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని సంకీర్ణ సర్కారు కుప్పకూలడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ రోజు పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే ఇమ్రాన్ ఖాన్పై అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుందని భావించినా సభ ప్రారంభమైన వెంటనే ఈ నెల 28కి వాయిదా పడింది. సోమవారం సభ తిరిగి ప్రారంభమైన అనంతరం అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయక తప్పదన్న వార్తలు వస్తున్నాయి. 

పాకిస్థాన్లో ఆర్థిక సంక్షోభానికి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) కారణమంటూ ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇమ్రాన్ ప్రభుత్వంపై మార్చి 8న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. పాకిస్థాన్ ప్రభుత్వం ఇప్పటికే మైనార్టీలో పడింది. దాదాపు 30 మంది ఎంపీలు మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం కొనసాగించేందుకు అవసరమైన సంఖ్యా కోల్పోయింది. ఈ క్రమంలో సోమవారం ఆయన బలం నిరూపించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో పాకిస్థాన్ లో ప్రస్తుతం క్యాంప్ రాజకీయాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే సంఖ్యాబలం లేకపోయినా తాను రాజీనామా చేయనని, ప్రభుత్వాన్ని కాపాడుకుంటామని ఇమ్రాన్ ఖాన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తల కోసం..

రష్యా నుంచి కొనుగోళ్లు తగ్గించాలన్న బైడెన్

ఉక్రెయిన్‌లో థియేటర్పై మిస్సైల్ దాడి.. 300 మంది మృతి