జొకోవిచ్ వందో విజయం

జొకోవిచ్ వందో విజయం

పారిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఫ్రెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వందో విజయం ఖాతాలో వేసుకున్న సెర్బియా లెజెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నొవాక్ జొకోవిచ్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్ చేరుకున్నాడు.  అమెరికా అమ్మాయిలు కోకో గాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మాడిసన్ కీస్ ముందంజ వేశారు. సోమవారం జరిగిన మెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆరో సీడ్ నొవాక్ 6–2, 6–3, 6–2తో కామెరూన్ నోరి (బ్రిటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)ను వరుస సెట్లలో చిత్తు చేశాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో నొవాక్‌కు ఇది వందో విజయం కావడం విశేషం.  

మూడో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 6–4, 3–0తో ఉన్న దశలో ప్రత్యర్థి టాలన్ (నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) తప్పుకోవడంతో వాకోవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ముందంజ వేశాడు. విమెన్స్ ప్రిక్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో రెండో సీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గాఫ్​   6–0, 7–5తో ఎకతరీనా అలెగ్జాండ్రోవాను ఓడించగా,  ఏడో సీడ్ కీస్  6–3, 7–5తో బాప్టిస్టె (అమెరికా)పై నెగ్గింది. కానీ, మూడో సీడ్ పెగులా (అమెరికా) 6–3, 4–6, 4–6తో అన్‌సీడెడ్‌ లియోస్ బైసన్ (ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) చేతిలో ఓడిపోయింది.