సాహిత్య రంగంలో టాంజానియా రచయితకు నోబెల్

సాహిత్య రంగంలో టాంజానియా రచయితకు నోబెల్

సాహిత్య రంగంలో నోబెల్ బహుమతి టాంజానియా నవలా రచయిత అబ్దుల్ రజాక్‌ గుర్నాకు లభించింది. సామ్రాజ్య, వలస వాదంపై ఆయన చేసిన పోరాటం, గల్ఫ్ దేశాల్లో శరణార్థుల స్థితిగతులను కళ్లకు గట్టినట్టు తన రచనల్లో పొందుపరిచినందుకు గుర్తింపుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ఎంపిక చేసినట్లు నోబెల్‌ జ్యూరీ ప్రకటించింది. 

అబ్దుల్ రజాక్.. 1948లో జింజిబర్ దీవిలో పుట్టారు. ఈ దీవికి 1963లో బ్రిటిష్ పాలకుల నుంచి స్వాతంత్ర్యం వచ్చింది. అయితే ఆ సమయంలో దీనిని టాంజానియాలో విలీనం చేశారు. స్వాతంత్ర్యం వచ్చాక ఆ దేశానికి అధ్యక్షుడిగా ఉన్న అబిద్ కరుమే పాలనలో అరాచకం రాజ్యమేలింది. ఆ సమయంలో అరబ్బులపై జాతి వివక్ష దాడులు జరిగేవి. అబ్దుల్ రజాక్‌ కూడా అరబ్ జాతికి చెందిన వాడే కావడంతో ఆ అరాచక పాలన నుంచి బయటపడేందుకు దేశం విడిచి 1966లో ఇంగ్లండ్‌కు శరణార్థిగా వలస వెళ్లారు. అక్కడే ఉన్నత విద్య పూర్తి చేసి.. కెంట్ యూనివర్సిటీలో ఇంగ్లిష్, లిటరేచర్ ప్రొఫెసర్‌‌గా పని చేశారు. ఇటీవలే ఆయన రిటైర్ అయ్యారు. 

21 ఏండ్ల నుంచే రచనలు..

అబ్దుల్ రజాక్ తన 21వ ఏట నుంచే ఇంగ్లిష్‌లో రచనలు చేయడం ప్రారంభించారు. పది నవలలు, అనేక షార్ట్‌ స్టోరీలు రాశారు. అబ్దుల్ రజాక్ చదువుకునేటప్పడు తన మూలాలను మర్చిపోకుండా తన దేశంలో వాడే స్వహిలీ భాషను తన హయ్యెర్ ఎడ్యుకేషన్‌లో ఫస్ట్‌ లాంగ్వేజ్‌గా ఎంచుకున్నారు. అయితే రచనలు మాత్రం ఇంగ్లిష్‌లోనే చేశారు. స్వయంగా శరణార్థిగా, వలస జీవిగా ఎదుర్కొన్న కష్టాలను, ఖండాలు, దేశాలు మారడం వల్ల ఆ శరణార్థులకు అనుభవించే కష్టాలు, అక్కడ ఎదురయ్యే సమస్యలు, వివక్ష, కన్నీళ్లనే తన సాహిత్యంలో ఎక్కువగా ప్రతిబింబించేవి.

మరిన్ని వార్తల కోసం..

జిల్లాకో మెడికల్ కాలేజీ పెడ్తం: ప్రధాని మోడీ

హెడ్మాస్టర్ ఇంట్లో ఫంక్షన్.. ఫుడ్ పాయిజనింగ్‌తో 100 మంది ఆస్పత్రిపాలు

హత్యలతో నిరసనలను అణచివేయలేరు: బీజేపీ ఎంపీ వార్నింగ్