మహాజాతరకు అంతరాయం లేకుండా కరెంట్ : సీఎండీ వరుణ్ రెడ్డి

మహాజాతరకు అంతరాయం లేకుండా కరెంట్  : సీఎండీ వరుణ్ రెడ్డి

తాడ్వాయి, వెలుగు: 2026 జనవరి 28 నుంచి 31 వరకు జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతరకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన విద్యుత్ శాఖ అధికారులతో కలిసి వనదేవతలను దర్శనం చేసుకున్నారు. 

అనంతరం విద్యుత్ పనులపై ములుగు, ఏటురునాగారం డివిజన్ పరిధిలోని డివిజనల్ ఇంజినీర్లు, అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్లు, సబ్ ఇంజినీర్లతో మేడారంలో సమీక్ష నిర్వహించారు. విద్యుత్ ఉద్యోగులందరూ సమిష్టిగా పని చేయాలన్నారు. అంతకుముందు మహాజాతర నేపథ్యంలో చేపట్టిన విద్యుత్ పనులను పరిశీలించారు.