నిఫ్టీ నెక్స్ట్‌ 50 పై ఫ్యూచర్స్‌‌, ఆప్షన్స్‌‌ .. ఏప్రిల్ 24 నుంచి అందుబాటులోకి

నిఫ్టీ నెక్స్ట్‌ 50 పై ఫ్యూచర్స్‌‌, ఆప్షన్స్‌‌ .. ఏప్రిల్ 24 నుంచి అందుబాటులోకి

న్యూఢిల్లీ: నిఫ్టీ నెక్స్ట్‌‌ 50 ఇండెక్స్‌‌పై ఫ్యూచర్స్‌‌, ఆప్షన్స్ కాంట్రాక్ట్‌‌లను ఏప్రిల్‌‌ 24 నుంచి  ఎన్‌‌ఎస్‌‌ఈ అందుబాటులోకి తీసుకురానుంది. నిఫ్టీ 100  నుంచి నిఫ్టీ 50  కంపెనీలను తీసేయగా మిగిలిన కంపెనీలు నిఫ్టీ నెక్స్ట్‌‌ 50 లో ఉంటాయి. ‘నిఫ్టీ నెక్స్ట్‌‌ 50 పై డెరివేటివ్‌‌ కాంట్రాక్ట్‌‌లను తీసుకురావడానికి సెబీ ఆమోదం తెలిపింది. ఈ కాంట్రాక్ట్‌‌లను ఈ నెల         24 న లాంచ్ చేస్తాం’ అని ఎన్‌‌ఎస్‌‌ఈ ఓ స్టేట్‌‌మెంట్‌‌లో పేర్కొంది.

మూడు నెలల మంత్లీ సిరీస్‌ ఫ్యూచర్స్‌‌, ఆప్షన్స్ కాంట్రాక్టులను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ఏడాది మార్చి నాటికి నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్‌‌లో ఫైనాన్షియల్ సెక్టార్ వాటా 23.76 శాతంగా, క్యాపిటల్ గూడ్స్ సెక్టార్ వాటా 11.91 శాతంగా, కన్జూమర్ సర్వీసెస్ వాటా 11.57 శాతంగా ఉంది.