
యాదాద్రి వెలుగు: జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు స్కూల్ బస్సులను పరిశీలించి ఫిట్‌నెస్ లేని బస్సులను సీజ్ చేయాలని ఎన్ఎస్‌యూఐ ఆధ్వర్యంలో బుధవారం డీటీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎన్ ఎస్ యుఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సురుపంగ చందు మాట్లాడుతూ.. రవాణా శాఖ అధికారులు హెచ్చరించినప్పటికీ కొన్ని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు తమ ఇష్టానుసారం పర్మిట్ లేకుండా ఫిట్నెస్ లేని బస్సులను నడుపుతున్నారని, అనుభవం లేని డ్రైవర్లతో పరిమితికి మించి విద్యార్థులను బస్సులో ఎక్కిస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు. విద్యార్థుల భద్రత దృష్టిలో ఉంచుకొని ఫిట్‌నెస్ లేని బస్సులను రోడ్లపై తిరిగితే కఠినంగా చర్యలు తీసుకోవాలని డీటీఓను కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్‌యూఐ జిల్లా కార్యదర్శి ఎండి. అసద్, మండల అధ్యక్షుడు భువనగిరి ఉపేందర్, ఉగ్గి దుర్గా ప్రసాద్, బండిరాల శివ తదితరులు పాల్గొన్నారు.