
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ థియేటర్ నే తగలబెట్టేశారు. మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సంధర్బంగా ఆయన సూపర్ హిట్ సినిమా సింహాద్రి మూవీని రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో సినిమా రిలీజ్ రోజున ఎన్టీఆర్ ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శించారు. సినిమా రిలీజైన థియేటర్ల ముందు పాలాభిషేకాలు, కేక్ కట్ చేసి సందడి చేశారు.
అక్కడి వరకు బాగానే ఉంది కానీ.. విజయవాడలోని గాంధీనగర్ అప్సర థియేటర్‌లో అభిమానులు ఏకంగా బాణాసంచా పేల్చారు. దీంతో సీట్లకు నిప్పు అంటుకుని థియేటర్ మొత్తం వ్యాపించాయి. పక్కనే ఉన్న పోలీసులు వేంటనే స్పంధించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో సినిమా చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఈ అనుకోని ఘటనతో సాయంత్రం ప్రదర్శించాల్సిన షోలను నిర్వాహకులు రద్దు చేశారు. అదృష్టవశాస్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.