ఎంపీ వివాహం చెల్లదని కోర్టు తీర్పు

ఎంపీ వివాహం చెల్లదని కోర్టు తీర్పు

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, నటి నుస్రత్ జహాన్, బిజినెస్‌మేన్ నిఖిల్ జైన్‌ల పెళ్లి చెల్లదని కోల్‌కతా కోర్టు ప్రకటించింది. వీళ్లిద్దరి వివాహం చట్టబద్ధం కాదని కోర్టు తేల్చిచెప్పింది. టర్కీలోని బోడ్రమ్‌లో 2019, జూన్ 19న నిఖిల్, నుస్రత్‌ల మధ్య జరిగినట్లుగా చెబుతున్న పెళ్లి.. భారత చట్టాల ప్రకారం చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది. నుస్రత్, నిఖిల్ మధ్య విభేదాల నేపథ్యంలో తమ వివాహం చెల్లుబాటు కాదని ప్రకటించాలంటూ నిఖిల్ జైన్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ సందర్భంగా.. హిందూ, ముస్లిం అయిన వారిద్దరూ దేశ వివాహ చట్టం ప్రకారం పెళ్లి చేసుకోనందున, వారి వివాహాన్ని చట్టపరమైనదిగా పరిగణించలేమని జడ్జి అన్నారు. 

మరిన్ని వార్తల కోసం: 

జై భీం మూవీపై వివాదం.. సూర్య ఇంటికి పోలీసు భద్రత

ఓయూ స్టూడెంట్స్ ఉన్న హాస్టల్‌లో ఎన్‌ఐఏ సోదాలు

ఒకరిపై ఒకరు విమర్శలు ఆపి.. వడ్లు కొనుర్రి