ఒలింపిక్స్ లో అవకతవకలు.. మాజీ చీఫ్ కు 30 ఏండ్ల జైలు

ఒలింపిక్స్ లో అవకతవకలు.. మాజీ చీఫ్ కు 30 ఏండ్ల జైలు

బ్రెజిల్ ఒలింపిక్స్ 2016లో అవకతవకలకు పాల్పడ్డ కారణంగా ఒలంపిక్ కమిటీ మాజీ చీఫ్ కార్లోస్ ఆర్థర్ నుజ్మాన్ కు కోర్టు శిక్ష విధించింది. ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం ఓటర్లను ప్రలోభపెట్టారనే ఆరోపణతోపాటు.. అవినీతి, మనీ లాండరింగ్ కు పాల్పడ్డారంటూ ఆయనపై పలు ఫిర్యాదులు రావడంతో కేసు నమోదు చేశారు. ఈ కేసుల విచారణ చేపట్టిన కోర్టు.. నుజ్మాన్ కు 30 ఏండ్ల 11 నెలల శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అయితే నుజ్మాన్ పై మరికొన్ని కేసులు పెండింగ్ లో ఉండటంతో.. ఆయన జైలు శిక్ష అమలును తాత్కాలికంగా వాయిదా వేశారు. నుజ్మాన్ తో పాటు కమిటీ డైరెక్టర్ జనరల్ బ్రెటాస్ కు కూడా శిక్ష పడింది. ఇంటర్నేషనల్ అసోసియేషన్ అథ్లెటిక్స్ ప్రెసిడెంట్  లామిన్ డియాక్, అతని కొడుకు పాపా డియక్ కు లంచం ఇచ్చేందుకు నుజ్మాన్ ప్రయత్నాలు చేశారంటూ విచారణ సంస్థలు ఇచ్చిన నివేదికపై విచారణ జరిపిన కోర్టు తుది తీర్పును వెలువరించింది.