అక్టోబర్ 13 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు

అక్టోబర్ 13 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు
  • ఈ నెల 26న రీ ఓపెన్​

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని స్కూళ్లకు శుక్రవారం నుంచి దసరా పండుగ సెలవులు ప్రారంభమయ్యాయి. ఈ నెల 25 వరకు 13 రోజుల పాటు సర్కారు, ప్రైవేటు, ఎయిడెడ్ తదితర అన్ని మేనేజ్‌మెంట్ల స్కూళ్లకు ప్రభుత్వం హాలీడేస్‌ ప్రకటించింది.ఈ నెల 26న తిరిగి స్కూళ్లు ప్రారంభం అవుతాయని విద్యా శాఖ అధికారులు తెలిపారు. పండుగ సెలవుల్లో స్కూళ్లల్లో ఎలాంటి క్లాసులు నిర్వహించొద్దని మేనేజ్‌‌‌‌మెంట్లకు ఆదేశాలు జారీ చేశారు.

కాగా, ఈ నెల 14 నుంచి 24 వరకు ఉస్మానియా వర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ కాలేజీలకు అధికారులు సెలవులు ప్రకటించారు. ఈ నెల 19 నుంచి 25 వరకు ఇంటర్మీడియెట్‌‌‌‌ కాలేజీలకు సెలవులు ఉంటాయని ఇంటర్‌‌‌‌‌‌‌‌ బోర్డు వెల్లడించింది.


ALSO READ: పెయిడ్ న్యూస్ పర్యవేక్షణకు ఎంసీఎంసీ కమిటీలు

బతుకమ్మ పండుగకు సెలవులు ఇవ్వరా? 

ఈ నెల 23 నుంచి 28 వరకు జేఎన్టీయూ సెలవులు ఇవ్వడంపై లెక్చరర్లు, స్టూడెంట్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో 14 నుంచి సెలవులు ఇస్తే.. జేఎ న్టీయూ మాత్రం దసరా రోజు నుంచి హాలీడేస్‌‌‌‌ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బతుకమ్మ పండుగకు సెలవులు ఇవ్వరా అని ప్రశ్నిస్తున్నారు. కాగా, జేఎన్టీయూ కూడా ఈ నెల 14 నుంచి 26 వరకు దసరా హాలీడేస్‌‌‌‌ ఇవ్వాలని టీఎస్‌‌‌‌టీసీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు.