ODI World Cup 2023: కావాలనే ఓడారు: వరుసగా రెండో మ్యాచ్ లోనూ పాక్ ఓటమి

ODI World Cup 2023: కావాలనే ఓడారు: వరుసగా రెండో మ్యాచ్ లోనూ పాక్ ఓటమి

వరల్డ్ కప్ సన్నాహక మ్యాచుల్లో పాకిస్తాన్ జట్టు వరుసగా రెండో మ్యాచ్ లోనూ ఓడింది. ఉప్పల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో 14 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆసీస్ జట్టు నిర్దేశించిన 352 పరుగుల లక్ష్య చేధనలో పాక్ బ్యాటర్లు 337 పరుగులకే కుప్పకూలారు.

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. మాక్స్ వెల్(77), క్రిస్ గ్రీన్(50) హాఫ్ సెంచరీలు చేయగా.. వార్నర్ (48), జోష్ ఇగ్నిస్(48) పరుగులతో రాణించారు. పాక్ బౌలర్లలో ఉసామా మీర్ 2 వికెట్లు తీసుకోగా.. హరీష్ రౌఫ్, వసీం జూనియర్, షాదాబ్ ఖాన్, మహమ్మద్ నవాజ్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.

అనంతరం 352 పరుగుల లక్ష్య చేధనలో పాక్ 47.4 ఓవర్లలో 337 వద్ద ఆటను ముగించింది. బాబర్ ఆజాం (90 నాటౌట్), ఇఫ్తికార్ అహ్మద్(83 నాటౌట్) హాఫ్ సెంచరీలు చేయగా.. మహమ్మద్ నవాజ్ 50 పరుగులతో పర్వాలేదనిపించాడు. మార్నస్ లబుచానే 3 వికెట్లు తీసుకోగా.. మిచెల్ మార్ష్, కమిన్స్ చెరో 2 వికెట్లు తీసుకున్నారు.

కావాలనే ఓడారు

ఒకానొక దశలో పాకిస్తాన్ గెలిచే అవకాశం ఉన్నా.. వామప్ మ్యాచ్ కావడంతో ఇతర బ్యాటర్ల ప్రాక్టీస్ కోసం    కీలక బ్యాటర్లు రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగారు. అదే ఆ జట్టు ఓటమికి ప్రధాన కారణం. నేటితో వామప్ మ్యాచ్ లు ముగియగా.. అక్టోబర్ 5 నుంచి ప్రధాన మ్యాచులు మొదలుకానున్నాయి.