పూరి జగన్నాథ ఆలయం రీ ఓపెన్.. భక్తులకు ఎంట్రీ

పూరి జగన్నాథ ఆలయం రీ ఓపెన్.. భక్తులకు ఎంట్రీ

ప్రముఖ పుణ్యక్షేత్రం ఒడిషా పూరీలోని జగన్నాథ ఆలయం భక్తుల కోసం ఇవాళ కూడా తెరిచారు. కరోనా రూల్స్ తో ఇప్పటివరకు వారంలో 5 రోజులు మాత్రమే ఆలయాన్ని ఓపెన్ చేసేవారు. కరోనా కేసులు తగ్గుతుండడంతో ఇవాళ్టి నుంచి శనివారం కూడా భక్తుల దర్శనానికి అనుమతిస్తున్నారు. 

కరోనా సెకండ్ వేవ్ తో మూడు నెలల పాటు జగన్నాథ ఆలయాన్ని మూసివేశారు. గత నెల 12న ఆలయాన్ని తెరిచారు. తొలిదశలో దేవాలయం సేవకుల కుటుంబ సభ్యులకు మాత్రమే దర్శనం కల్పించారు. రెండో దశలో ఆగస్ట్ 16 నుంచి పూరీలో నివసించే వారిని అనుమతించారు. ఆగస్ట్ 23 నుంచి పూర్తి స్థాయిలో భక్తులకు పర్మిషన్ ఇచ్చారు. రాష్ట్రంలో కరోనా నిబంధనలు అమల్లో ఉండడంతో ఇప్పటివరకు శని, ఆదివారాల్లో ఆలయాన్ని మూసివేశారు. అలాగే కృష్ణాష్టమి అయిన ఆగస్ట్ 30, వినాయక చవితి సెప్టెంబర్ 10 వంటి ప్రధాన పండుగలలో గుడిని బంద్ చేశారు.