పింఛన్ కోసం..తల్లిని మంచంతో పాటే బ్యాంకుకు లాక్కెళ్ళిన కూతురు

పింఛన్ కోసం..తల్లిని మంచంతో పాటే బ్యాంకుకు లాక్కెళ్ళిన కూతురు

భువనేశ్వర్: పింఛన్ తీసుకునేందుకు 100 ఏళ్ల తన తల్లిని ఓ కూతురు మంచంపై పడుకో బెట్టి బ్యాంకు దాకా లాక్కెళ్లింది. బ్యాంక్ ఆఫీసర్ ఫిజికల్ వెరిఫికేషన్ చేశాకే డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు పర్మిషన్ ఇస్తాననటంతో మరో దారిలేక ఇలా చేశానని చెప్పింది. ఒడిశాలోని నౌపారా జిల్లా బార్గావ్‌ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఉదంతం మొత్తాన్నీ కొందరు వీడియో తీసి, నెట్లో పెట్టడంతో వైరల్గా మారింది. ప్రధాన మంత్రి గరీబ్ యోజనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం జన్ధన్ ఖాతాల్లోరూ.500 చొప్పున మూడు నెలలుగా జమచేస్తోంది. ఈ పథకం కింద తన తల్లి అకౌంట్లో జమ అయిన పింఛన్ తీసుకునేందుకు 60 ఏండ్ల పుంజిమతి బ్యాంక్ కు  వెళ్లారు. ఫిజికల్ వెరిఫికేషన్ అని బ్యాంకు సిబ్బంది చెప్ప టంతో చేసేదేమీ లేక ఇలా మంచంపై పడుకొని ఉన్న తల్లిని బ్యాంక్ వరకు లాక్కొచ్చారు. ఈ ఘటనపై కలెక్టర్ మధుస్మిత సాహూ స్పందిం చారు. ఫిజికల్ వెరిఫికేషన్ కోసం సిబ్బంది వారి ఇంటికి వెళ్లేలోపే పుంజిమతి తన తల్లిని మంచంతో సహా తీసుకొచ్చారని చెప్పారు. సోషల్ మీడియాలో చాలామంది ఈ సంఘట నపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రైవేటులో కరోనా టెస్టులు