
సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రులపై శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దాడులు చేశారు. గర్భిణులకు అవసరం లేకున్నా సిజేరియన్ కాన్పులు చేస్తున్నట్లు ఫిర్యాదు అందడంతో ఎనిమిది ఆస్పత్రుల్లో తనిఖీలు చేశారు. రికార్డులు పరిశీలించి ఎక్కువ సిజేరియన్ ఆపరేషన్లు జరిగినట్లు గుర్తించి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మధుబాబు హాస్పిటల్‌లోని రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో డిప్యూటీ డీఎంహెచ్‌వో చంద్ర శేఖర్, డీఐవో వెంకట రమణ, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ జశ్వంత్ సుందర్, ఎస్‌వో వీరయ్య, డెమో అంజయ్య ఉన్నారు.