పర్మిషన్ లేని స్కూళ్లు సీజ్​

పర్మిషన్ లేని స్కూళ్లు సీజ్​

రాజన్న సిరిసిల్ల, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పర్మిషన్​ లేదని రెండు కార్పొరేట్ స్కూళ్లను అధికారులు మంగళవారం సీజ్ చేశారు. ఇటీవల నారాయణ, శ్రీ చైతన్య స్కూళ్లు ప్రారంభమయ్యాయి. అయితే వీటికి పర్మిషన్ ​లేకపోవడంతో ఏబీవీపీ లీడర్లు ఆందోళన చేశారు. స్పందించిన డీఈవో విద్యాధికారులను పంపారు. వారు విద్యార్థులను బయటకు పంపించి స్కూళ్లను సీజ్​ చేశారు. ఒకేరోజు రెండు స్కూళ్లను సీజ్​ చేయడంతో పిల్లలను జాయిన్​చేసిన తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  పర్మిషన్​ లేకుండా స్కూళ్లను ప్రారంభిస్తున్నా ఆఫీసర్లు ఏం చేస్తున్నారని ఏబీవీపీ లీడర్లు ప్రశ్నిస్తున్నారు. 

జగిత్యాలలో మరో స్కూల్.. 

జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాలలో పర్మిషన్​లేదని ఓ స్కూల్‌ను ఎంఈవో గాయత్రి సీజ్​చేశారు. మదర్సా ఇందాద్ ఉల్ ఉలూమ్ స్కూల్‌కు పర్మిషన్​ లేదని ఈ స్కూల్‌ను సీజ్​చేస్తున్నట్లు ఆమె చెప్పారు. పర్మిషన్ ​లేని  స్కూళ్లలో తమ పిల్లలను చేర్చొద్దని పేరెంట్స్​కు ఎంఈవో సూచించారు.