ఆయిల్ పామ్ ధరలు తగ్గుతున్నయ్

ఆయిల్ పామ్ ధరలు తగ్గుతున్నయ్
  • టన్ను గెల రేటు రూ.16,800
  • నెలలోనే రూ.4 వేలు తగ్గుదల 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : ఆయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధర లు తగ్గుతుండడంతో రైతుల్లో బుగులు పుడుతోంది. గత నెల వరకు భారీగా పెరిగిన ధరలు ఇప్పుడు అమాంతం పడిపోయాయి. మే నెలలో టన్ను పామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెల ధర రూ.22,842 పలుకగా తాజాగా రూ.16,800లకు పడిపోయింది. ధర మరింత తగ్గే అవకాశాలున్నాయని మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్గాలు చెప్తున్నాయి. రష్యా, ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యుద్ధం, ఇండోనేషియా పామాయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టులపై నిషేధం వంటి పరిణామాలతో వంట నూనెల ధరలు పెరిగి పామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెల ధర భారీగా పెరిగింది. తాజాగా ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టులపై సడలింపులతో ధరలు పడిపోయాయి. 

ఏడేండ్లుగా పెరిగి..
ఆయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెల ధరలు గత ఏడేళ్లుగా క్రమంగా పెరుగుతూ వచ్చాయి. 2015లో టన్ను పామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెల మాగ్జిమమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ.6,811 ఉండగా, 2018 నాటికి రూ.10 వేలు దాటింది.  2020 నాటికి రూ.12,800 పలుకగా 2021నాటికి రూ.19,114 వరకు పెరిగింది. 2022 నాటికి రూ.22,842 వరకు రికార్డు ధర పలికింది. పోయిన నెలలోనూ టన్ను గెల ధర రూ.20,250 వరకు పలికింది.