విదేశీ మార్కెట్లలో ఓలా కార్యకలాపాలు బంద్​

విదేశీ మార్కెట్లలో ఓలా కార్యకలాపాలు బంద్​

న్యూఢిల్లీ:  రైడ్-హెయిలింగ్ సేవల సంస్థ ఓలా యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌‌‌‌లలో కార్యకలాపాలను మూసివేయాలని నిర్ణయించుకుంది.  భారత వ్యాపారంపై దృష్టి సారిస్తామని దాని ప్రమోటర్ ఏఎన్​ఐ టెక్నాలజీస్ మంగళవారం తెలిపింది. సాఫ్ట్‌‌‌‌బ్యాంక్- మద్దతు గల ఈ కంపెనీ భారతదేశంలో విస్తరణకు అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలిపింది.  కంపెనీ ఈ కార్యకలాపాలను 2018లో దశలవారీగా ప్రారంభించింది. 

 ఏఎన్​ఐ టెక్నాలజీస్​కు 2023 ఆర్థిక సంవత్సరంలో ఏకీకృత నికర నష్టం రూ.772.25 కోట్లకు తగ్గింది. 2022 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 1,522.33 కోట్ల ఏకీకృత నష్టాన్ని నమోదు చేసింది.  2023లో కార్యకలాపాల ద్వారా ఏకీకృత ఆదాయం రూ.1,679.54 కోట్ల నుంచి రూ.2,481.35 కోట్లకు 48 శాతం పెరిగింది.