ఆమె వయసు 52ఏళ్ల.. గౌరవ ప్రధమైన గవర్నర్ హోదాలో ఉంది.. చేసేవేమో పాడు పనులు. ఆ లేడీ ఆఫీస్ గురించి చెప్తే చీదరించుకోవాల్సిందే.. అక్రమ సంపాదన, అక్రమ సంబంధాలతో ఆమె డైరీ అంతా నిండి పోయింది. తనకున్న అందంతో ఆఫీస్ లో కింద స్థాయి అధికారులతోపాటు ఇంక ఇతరులతో కలిపి మొత్తం 58 మందితో ఆమెకు లైగింక సంబంధాలు ఉన్నాయిని విచారణలో తేలింది. బండారం బయట పడి 13 ఏళ్ల జైలు శిక్ష పడింది. 1.4 లక్షల డాలర్ల జరిమానా కూడా విధించారు. దీంతో ఆమె గురించి ఇంటర్ నెట్ లో వైరల్ గా అవుతుంది. ఇంతకీ ఆఫీసర్ ఎవరు.. ఆమె ఎందుకు ఇలా చేసిందో చూద్దాం..
డబ్బు, రాజకీయ పలుకు బడి కోసం కింద స్థాయి సిబ్బందితో అక్రమ సంబంధాలు పెట్టుకుంది చైనాలోని ఓ అధికారిణి. జాంగ్ యాంగ్ కు పెళ్లి అయినా ఆమె రాజకీయ భవిష్యత్తు కోసం గిజావ్ ప్రావిన్స్‌లోని కియానన్ ప్రిఫెక్చర్‌లో అనేక దారుణాలకు తెగబడింది. సామాన్య కుంటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆమె 22 ఏళ్లకే కమ్యూనిస్టు పార్టీలో చేరింది. తర్వాత రైతుల కోసం ఓ కోఆపరేటివ్ సొసైటీ పెట్టి మంచి గుర్తింపు పొందింది. పార్టీలో క్రమక్రమంగా ఎదుగుతూ కియానన్ ప్రిఫెక్చర్‌కు గవర్నర్‌గా, డిప్యుటీ గవర్నర్‌గా సేవలందించింది. ఆమె చాలా అందగత్తే.. ఆకర్షణీయంగా ఉండే ఆమెకు బ్యూటిఫుల్ గవర్నర్ అన్న పేరు కూడా ఉంది.
అధికారాన్ని అడ్డం పెట్టుకొని విచ్చల విడిగా రెచ్చిపోయింది. దాదాపు 60 మిలియన్ యువాన్లు (7,10,599,312 కోట్లు) లంచాలు తీసుకుంది. అంతేకాదు ఆమె అక్రమాలు బయటకు రాకుండా 58 మందితో అక్రమ సంబంధాలు కూడా పెట్టుకుంది.
అందాన్ని ఆశగా చూపించి చాలామందిని లొంగదీసుకుంది. ఎప్పుడూ నైట్ క్లబ్ లో మగవారితో తిరుగుతుందట. తరచూ ఆమె బ్యాగులో కండోమ్‌లు ఉండేవని స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. ఆమెకు మొత్తం 58 లవర్స్ ఉన్నట్టు వార్తలు సంచలనం రేకెత్తించాయి. గతేడాది స్థానిక మీడియా నిర్వహించిన ఓ స్టింగ్ ఆపరేషన్‌లో ఆమె బండారం మొత్తం బయట పడింది. ఆమె అనైతిక ప్రవర్తన, అక్రమాలకు సంబంధాల గురించి పార్టీ నాయకత్వం దర్యాప్తు చేసింది. తర్వాత.. పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ క్రమంలోనే కోర్టు ఆమెకు 13 ఏళ్ల కారాగార శిక్ష,1.4 లక్షల డాలర్ల జరిమానా విధించారు. జాంగ్ యాంగ్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.