అయిజలో అనుమతి లేని నిర్మాణాలు కూల్చివేత

అయిజలో అనుమతి లేని నిర్మాణాలు కూల్చివేత

అయిజ, వెలుగు: పట్టణంలోని కర్నూల్–​ రాయచూరు చౌరస్తాలో మున్సిపాలిటీ పర్మిషన్  లేకుండా నిర్మిస్తున్న కట్టడాలను శుక్రవారం మున్సిపల్  అధికారులు కూల్చివేశారు. పట్టణానికి చెందిన ఓ వ్యాపారి 11 ఇండ్ల నిర్మాణానికి పర్మిషన్​ తీసుకొని, అదనంగా రెండు నిర్మాణాలు చేస్తున్నట్లు పట్టణానికి చెందిన పలువురు మున్సిపాలిటీ లో ఫిర్యాదు చేసి, హైకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టు ఉత్తర్వుల మేరకు మున్సిపల్  అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేశారు. శాంతినగర్ సీఐ శివశంకర్ గౌడ్, ఎస్ఐ నరేశ్​కుమార్  ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జేసీబీతో నిర్మాణాలను కూల్చివేశారు.