Silk Smitha Biopic: సౌత్ ఇండస్ట్రీ ఆడియన్స్ను ఉర్రూతలూగించిన సిల్క్

Silk Smitha Biopic: సౌత్ ఇండస్ట్రీ ఆడియన్స్ను ఉర్రూతలూగించిన సిల్క్

సిల్క్ అంటే అందమే కాదు..అంతకు మించి ఏదో ఉందనే నిజాన్ని ఇప్పటికీ ఎవరూ సరిగా గుర్తించలేదు.తన పాట ఉంటేనే సినిమా కొంటామని డిస్ట్రిబ్యూటర్లు సైతం పట్టుబట్టే రోజుల నుంచి..ఆత్మహత్య చేసుకునే రోజు వరకి తన జీవితంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. 

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కబోతుందని ఎప్పటి నుంచో న్యూస్ వినిపిస్తూనే ఉంది. కానీ, ఆమె అసలైన బయోపిక్ ను చూపించడానికి ఏ డైరెక్టర్ డేర్ స్టెప్ వేయలేదు. మొత్తానికి ఇన్నాళ్ళకి నేడు ఆమె జయంతి (డిసెంబర్ 2) సందర్భంగా ‘సిల్క్ స్మిత: ది అన్‌టోల్డ్ స్టోరీ’ మూవీ రాబోతుందని మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ నుండి సిల్క్ ఫస్ట్లుక్ కూడా రిలీజ్ చేశారు.

ఈ బయోపిక్‌లో సిల్క్ స్మిత పాత్రను నటి చంద్రికా రవి (Chandrika Ravi) పోషిస్తున్నారు.ఈ పోస్టర్లో చంద్రికా అచ్చం సిల్క్లా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సిల్క్ ఫస్ట్లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాకు జయరాం (Jayaram) దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్‌బీ విజయ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలకానున్న ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలోకి వస్తుంది.

చంద్రికా రవి విషయానికి వస్తే..ఈమె  భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ మోడల్. 2012 మిస్ వరల్డ్ ఆస్ట్రేలియా, మిస్ ఇండియా ఆస్ట్రేలియాలో ఫైనలిస్ట్‌గా నిలిచిన మొదటి భారతీయ సంతతి మహిళగా గుర్తింపు పొందింది. ఆమె 2014 మిస్ మాగ్జిమ్ ఇండియాలో రన్నరప్ టైటిల్‌ను గెలుచుకుంది.

టాలీవుడ్ లో ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ సినిమాతో తెలుగు ఆడియాన్స్ కు దగ్గరైంది ఈ భామ. ఈ ఏడాది బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమాలో ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే’ పాటలో బాలయ్యతో ఆడిపాడి ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించింది. ఇక రాబోయే అందాలా తార సిల్క్ స్టోరీ లో ఎలా కనిపిస్తుందో చూడాలి.