18న రామప్పలో వారసత్వ ఉత్సవాలు

18న రామప్పలో వారసత్వ ఉత్సవాలు
  • 18న రామప్పలో వారసత్వ ఉత్సవాలు
  • రూ. 4.21 కోట్లతో అభివృద్ధి పనులు
  • మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌‌రావు, సత్యవతి రాథోడ్‌‌

హనుమకొండ, వెలుగు : ప్రపంచ వారసత్వ దినోత్స వం సందర్భంగా ఈ నెల 18న రామప్పలో వారసత్వ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రులు ఎర్ర బెల్లి దయాకర్‌‌‌‌‌‌‌‌రావు, సత్యవతి రాథోడ్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. 'శిల్పం.. వర్ణం.. కృష్ణం.. సెలబ్రేటింగ్‌‌‌‌‌‌‌‌ ద హెరిటేజ్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ రామప్ప’ పేరున నిర్వహించే ఉత్సవాలకు సంబంధించిన వాల్‌‌‌‌‌‌‌‌పోస్టర్‌‌‌‌‌‌‌‌ను శనివారం దయాకర్‌‌‌‌‌‌‌‌ రావు, సత్యవతి రాథోడ్‌‌‌‌‌‌‌‌ హనుమకొండ హరిత హోటల్‌‌‌‌‌‌‌‌లో ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ రామప్పలో నిర్వహించనున్న కార్యక్రమానికి మ్యూజిక్​ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ తమన్, డ్రమ్స్‌‌‌‌‌‌‌‌ వాయిద్యాకారుడు శివమణి, సింగర్​ కార్తీక్‌‌‌‌‌‌‌‌తో పాటు 300కు పైగా ప్రముఖులు, 20వేలకు పైగా ప్రేక్షకులు హాజరు కానున్నట్లు చెప్పారు.

రామప్ప అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. రాష్ట్రం త‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌ఫు న రూ.4.21 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేప ట్టినట్లు తెలిపారు. ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, శంకర్‌‌‌‌‌‌‌‌నాయక్‌‌‌‌‌‌‌‌, గ్రేటర్‌‌‌‌‌‌‌‌ వరంగల్‌‌‌‌‌‌‌‌ మేయర్ గుండు సుధారాణి, ములుగు, భూపాలపల్లి కలెక్టర్లు త్రిపాఠి, భవేష్ మిశ్రా పాల్గొన్నారు. అనంతరం నానాజీ దేశ్‌‌‌‌‌‌‌‌ముఖ్‌‌‌‌‌‌‌‌ సర్వోత్తమ్‌‌‌‌‌‌‌‌ పంచాయత్‌‌‌‌‌‌‌‌ సతత్‌‌‌‌‌‌‌‌ వికాస్‌‌‌‌‌‌‌‌ పురస్కారాల్లో ములుగు జిల్లా సెకండ్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలవడంతో క‌‌‌‌‌‌‌‌లెక్టర్‌‌‌‌‌‌‌‌, అధికారులు, సిబ్బందిని అభినందించారు. 

అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం కుట్ర

నర్సంపేట/నల్లబెల్లి, వెలుగు : తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని పంచాయతీ రాజ్‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌‌‌‌‌రావు విమర్శించారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి పోస్టుకార్డులు పంపే కార్యక్రమాన్ని శనివారం వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లా దుగ్గొండి మండలం మహ్మదాపురంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌‌‌‌‌‌‌‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, సబ్సిడీ ఎరువులు, విత్తనాలు ఇస్తుంటే కేంద్రం మాత్రం ఆంక్షలు విధిస్తోందన్నారు. అనంతరం వెంకటాపురం - రాజేశ్వరావుపల్లి బీటీ రోడ్డుకు, మహ్మదాపురంలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.