
క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. క్యాసినో కేసులో ఇప్పటికే చీకోటి ప్రవీణ్ ను విచారించిన ఈడీ.. తాజాగా థాయ్‌లాండ్‌లో జరిగిన ఘటన తర్వాత మరోసారి నోటీసులు జారీ చేసింది. చీకోటితో పాటు చిట్టి దేవేందర్, సంపత్, మాధవరెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు పంపింది. ఇందులో సంపత్ ఇప్పటికే ఈడీ విచారణకు హాజరు కాగా మరో ముగ్గురు ఈడీ ఎదుట హాజరుకావాల్సి ఉంది. థాయ్‌లాండ్ నుంచి మే12న చికోటి ప్రవీణ్ హైదరాబాద్ కు రానున్నారు. వచ్చే వారం ఈడీ ముందకు ఆయన వెళ్లనున్నారు. చీకోటి ప్రవీణ్ కు ఈడీ ఎలాంటి ప్రశ్నలు సంధించనుంది అన్నది ఆసక్తి నెలకొంది.
థాయ్‌లాండ్‌లోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో జూదం ఆడుతూ అక్కడి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు ప్రవీణ్. నాలుగు రోజులు ఫోకర్న్ టోర్నమెంట్ అని చెబితే తాను థాయ్‌లాండ్ కు వెళ్లినట్లుగా తెలిపాడు. దేవ్ , సీత అనే ఇద్దరు తనకు ఆహ్వానం పంపారని, ఆ టోర్నమెంట్ లీగల్ అనే చెబితేనే తాను వెళ్ళినట్టిగా చీకోటి తెలిపాడు. . థాయ్‌లాండ్ లో గ్యాంబ్లింగ్ నిషేధం అనేది తనకు తెలియదని చీకోటి చెప్పాడు. తాను హాల్ లోకి వెళ్లిన 10 నిమిషాలకే రైడ్ జరిగిందని అన్నాడు. ఈ గ్యాంబ్లింగ్ తో సంబంధం లేదని తేలడంతో తాను చట్టపరంగా బయటకు వచ్చానని అన్నాడు.
చీకోటి ప్రవీణ్ కు థాయ్‌లాండ్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆయనతోపాటు ఆరెస్ట్ అయిన 83 మంది భారతీయులకు కూడా థాయ్‌లాండ్ కోర్టు బెయిల్ ఇచ్చింది. రూ. 4500 బాట్స్ జరిమానాతో కోర్టు అందరికీ బెయిల్ ఇచ్చింది. జరిమానాను చెల్లించడంతో పోలీసులు వారికి పాస్ పోర్టులు కూడా ఇచ్చేశారు. దీంతో చీకోటి ప్రవీణ్ తో పాటుగా 83 మంది