శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆగని బంగారం అక్రమ రవాణా

శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆగని బంగారం అక్రమ రవాణా

శంషాబాద్​ విమానాశ్రయంలో మరోసారి బంగారం పట్టుబడింది. కస్టమ్స్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా బంగారం అక్రమ రవాణా ఆగడం లేదు. అధికారుల కళ్లుగప్పేందుకు ప్రయత్నించిన కిలాడీ లేడీని చాకచక్యంగా పట్టుకున్నారు. లోదుస్తుల్లో బంగారాన్ని దాచి తరలించే ప్రయత్నం చేయగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 70 లక్షల విలువచేసే 1300 గ్రామాలు గోల్డ్ ను అధికారులు సీజ్ చేశారు. 

మరోవైపు బ్యాంకాక్ నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడు అక్రమంగా బంగారాన్ని తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. అతని వద్ద 900 గ్రాముల గోల్డ్ ను స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని పొట్టలో దాచి తరలించే యత్నం చేయగా  కస్టమ్స్అధికారులకు అనుమానం వచ్చి తనిఖీలు చేశారు. కానీ అతడి వద్ద నుంచి బంగారం లభించలేదు. పొట్టను స్కానింగ్ చేయగా అందులో ఉన్న బంగారం గుట్టురట్టు అయ్యింది. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.