డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నెల రోజుల జైలు శిక్ష

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నెల రోజుల జైలు శిక్ష

నిజామాబాద్ క్రైమ్, వెలుగు: నిజామాబాద్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో సంచలన తీర్పు వెలువరించారు. డిచ్​పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో ఇటీవల ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. అతడిని పోలీసులు బుధవారం కోర్టులో హాజరుపరచగా, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎంఎం అలీ సిరాజ్ 30 రోజులపాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించారని ఎస్ఐ మహేశ్​తెలిపారు. 

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నెలరోజుల పాటు శిక్ష పడడం ఇదే తొలిసారని పోలీసులు పేర్కొన్నారు.