కోవిడ్ను జయించిన పసిపాప

కోవిడ్ను జయించిన పసిపాప

ఢిల్లీ : దేశంలో కరోనా మరోసారి విజృంభిస్తోంది. చిన్నా, పెద్ద తేడా లేకుండా వైరస్ సోకుతోంది. తాజాగా కోవిడ్ బారిన పడిన నెల వయసు చిన్నారి మహమ్మారిని జయించింది. పూర్తిగా కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయింది.
ఢిల్లీకి చెందిన నెల వయసు చిన్నారికి చెవి నొప్పి రావడంతో తల్లిదండ్రులు మూల్ చంద్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ట్రీట్మెంట్ ప్రారంభించేందుకు ముందు చిన్నారికి కోవిడ్ టెస్ట్ చేయగా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆ పసిపాపను ఎన్ఐసీయూలో అడ్మిట్ చేసుకున్నారు. నాలుగు రోజుల పాటు డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది కంటికి రెప్పలా చూసుకుంటూ ట్రీట్మెంట్ అందించారు. వైద్యానికి స్పందించి కోవిడ్ నుంచి కోలుకోవడంతో చిన్నారిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. చిన్నారి ఎన్ఐసీయూలో ఉన్నప్పటి వీడియోను హాస్పిటల్ యాజమాన్యం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. 

 

For more news..

టీచర్ల అరెస్టును ఖండిస్తున్నాం

బ్రిటన్‌ ప్రధాని రేసులో భారత సంతతి వ్యక్తి !