
హైదరాబాద్ : టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ పై మరో కేసు నమోదైంది. నకిలీ ఐడీ కేసులో రవిప్రకాష్ పై మరో కేసు నమోదు చేసినట్టు చెప్పారు సైబర్ క్రైమ్ స్టేషన్ పోలీసులు. ఐ ల్యాబ్ పేరుతో నటరాజన్ అనే వ్యక్తి పేరు మీద రవిప్రకాశ్.. ఫేక్ ఐడీ కార్డు క్రియేట్ చేసినట్టుగా పోలీసులు తేల్చారు. రవిప్రకాశ్ పై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 406/66 యాక్ట్ కింద కేసు పెట్టినట్టు చెప్పారు. చంచల్ గూడ జైలులో ఉన్న రవిప్రకాశ్ ను… పీటీ వారెంట్ పై మియాపూర్ కోర్టుకు తీసుకొచ్చారు పోలీసులు.