దారుణం.. హిజ్రాను కొట్టి చంపేశారు

దారుణం.. హిజ్రాను కొట్టి చంపేశారు

వెస్ట్ బెంగాల్ లో దారుణం జరిగింది. జల్ పైగురి జిల్లా సుల్కాపర గ్రామంలో ఓ హిజ్రాను స్థానికులు కొట్టి చంపేశారు. ఈ సంఘటన స్థానికంగా అలజడి సృష్టించింది.

చిన్న పిల్లలను ఎత్తుకుపోతున్నాడన్న అనుమానంతో.. ఆ హిజ్రాను స్థానికులు బంధించారు. ఆ తర్వాత కొట్టి విపరీతంగా దాడి చేశారు. పోలీసులు స్థానికులను వారించి… గాయపడ్డ హిజ్రాను హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఐతే.. తీవ్రమైన గాయాలతో ఆ హిజ్రా మధ్యలోనే ప్రాణం కోల్పోయాడని జిల్లా ఎస్పీ చెప్పారు.

చిన్నపిల్లలను ఎత్తుకెళ్లే ముఠాతో ఆ హిజ్రాకు సంబంధం లేదని పోలీసులు చెప్పారు. ఐతే.. సోషల్ మీడియాలో వ్యాప్తిచెందిన వైరల్ పోస్టులే ప్రజల్లో భయాందోళన కలిగించాయని… అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిపై దాడికి ఉసిగొల్పాయని పోలీసులు చెప్పారు.