మోర్తాడ్ వెలుగు: ఏర్గట్ల మండలంలోని పలు గ్రామాల్లో ట్రాన్స్ఫార్మర్లను దొంగతనం చేసిన ఇద్దరిని పట్టుకొని, రిమాండ్కు పంపినట్లు ఎస్సై రాజు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఒంగోలు జిల్ల సింగరాయ కొండకు చెందిన పల్లిపాటి ఏసుదాసు, మెదక్ జిల్లా చిన్న శంకరం పేట్ కు చెందిన నర్రా శ్రీధర్ ను ఏర్గట్ల ఎస్సై అరెస్టు చేసి వారి నుంచి ఐదు ట్రాన్స్ఫార్మర్ల దొంగతనం కేసులకు సంబంధించిన 160 కిలోల కాపర్ వైర్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దర్యాప్తు అనంతరం ఇద్దరిపై ఆర్మూ ర్ కోర్టు లో చార్జిషీటు ఫైల్ చేయగా, ఇద్దరికి సంవత్సరం జైలు శిక్ష పడిందని పోలీసులు తెలిపారు.
