
రంగారెడ్డి జిల్లా : శంషాబాద్ లో తాగిన మత్తులో ఆర్టీసీ బస్సు అద్దాలు పగలగొట్టాడు ఓ యువకుడు. స్థానికుడైన సూరజ్ ఈ ఉదయం శంషాబాద్ ఏరియాలో ఓవరాక్షన్ చేశాడు. తప్పతాగి నడిరోడ్డుపై వీరంగం సృష్టించాడు. రాళ్లు విసిరి ఆర్టీసీ బస్సు అద్దాలు పగలకొట్టాడు. అడ్డుకున్న కండక్టర్ పైనా దాడి చేశాడు. కొంతమంది ప్యాసింజర్ల సహాయంతో… నిందితుడు సూరజ్ ను పట్టుకుని.. పోలీసులకు అప్పగించారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు పరిధి పోలీసులు… నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బ్రీత్ ఎనలైజర్ టెస్టులు చేశారు. బ్రీత్ ఎనలైజర్ లో 150పాయింట్లు రావడంతో… నిందితుడు సూరజ్ పై కేసు పెట్టారు పోలీసులు.