
స్నేహితులు కొట్టారని అత్మహత్య చేసుకున్నాడు ఓ యువకుడు. తన చావుకు కారణం వీళ్లూ అంటూ ఓ లెటర్ రాసి ప్రాణం తీసుకున్నాడు. మిగిలిన స్నేహితులు, తల్లిదండ్రులు అందరికీ జాగ్రత్తలు చెప్పి తనువు చాలించాడు ఓ యువకుడు. ఈ దారుణ సంఘటన జనగామ జిల్లాలో జరిగింది.
జనగామ పట్టణంలోని వీవర్స్ కాలనీలో ఉండేవాడు సాయి ప్రసాద్. ఈ ఉదయం రైల్వే ట్రాక్ పై శవమై తేలాడు. అక్కడే 4 పేజీల సూసైడ్ లెటర్ ను రాసి పెట్టి చనిపోయాడు.
ఆ లెటర్ లో తనకు జరిగిన అవమానాన్ని, బాధను తట్టుకోలేకనే చనిపోతున్నానని రాసి ఉంచాడు సాయిప్రసాద్. “నేను బోగ సాయిప్రసాద్. నన్ను గొల్లపల్లి పవన్, వరుణ్ అనే ఇద్దరు కుక్కను కొట్టినట్టు కొట్టారు. నా శరీరం అంతా దెబ్బలు. ఈ బాధలతో నేను ఉండాలనుకోవడం లేదు. పవన్ నువ్వు నన్ను చాలా కొట్టావురా. ఇప్పటినుంచైనా ఆ కొట్టడం ఆపురా ప్లీజ్. వీళ్లిద్దరూ నన్ను ఫంక్షన్ హాల్ దగ్గర తోటలో కొట్టారు. అమ్మా జాగ్రత్త. ” అని లెటర్ రాసి చనిపోయాడు.
లెటర్ లో తన స్నేహితులను గుర్తుచేసుకున్నాడు సాయిప్రసాద్. ఇవ్వాల్సిన డబ్బుల్లో కొన్ని మరో ఫ్రెండ్ కు ఇవ్వాలని చెప్పాడు. అమ్మా, నాన్నను మీరే చూసుకోవాలని కోరాడు.
లెటర్ చదవిన సాయిప్రసాద్ కుటుంబసభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.