గేమింగ్ లో మునిగి పోతున్నరు

గేమింగ్ లో మునిగి పోతున్నరు

నిజానికి లాక్ డౌన్ వల్ల ఇంట్లో గడపటం పెరిగిపోయింది అనుకున్నారు. కానీ, ఇంట్లో ఉన్న టైం హౌస్ మెంబర్స్ తో కాకుండా ఆన్ లైన్లోనే గడుపుతున్నారు టీనేజర్స్. పబ్ జీ, ఫ్రీ ఫైర్ లాంటి షూటింగ్ గేమ్స్‌‌‌‌ తో పాటు లూడో, క్యారమ్స్, క్రికెట్ లాంటి ఆన్ లైన్ గేమ్స్ విపరీతంగా పెరిగిపోయాయి. చేయాల్సిన పనులని పోస్ట్ పోన్ చేసుకొని మరీ గేమింగ్ లో మునిగి పోతున్నారు. ఇంటర్నెట్ లో వచ్చే గేమ్స్ లో రెండు మూడేళ్లలో వైరల్ అయిన ఆన్ లైన్ గేమ్స్ ఒక ఎత్తు అయితే కేవలం లాక్ డౌన్ ఉన్న మూడు నెలల్లో పెరిగిన డౌన్ లోడ్స్ ఎక్కువగా ఉన్నాయి. 2017 డిసెంబర్‌‌‌‌లో లాంచ్ అయిన పబ్ జీ ముందు పీసీ, ఎక్స్‌‌‌‌ బాక్స్‌‌‌‌లో రిలీజ్ చేశారు. ఇది జస్ట్ సంవత్సర కాలంలోనే అప్పటివరకు ఉన్న అన్ని గేమింగ్‌ రికార్డ్స్‌ని బద్దలు కొట్టింది. ఆ తర్వాత ఆండ్రాయిడ్‌‌‌ వెర్షన్ కూడా లాంచ్ అయ్యింది. ఇంతగా ఈ గేంని ఆడటానికి కారణం అందులో ఉన్న ఇంటెన్స్‌‌‌‌ గేమ్‌‌‌‌ ప్లే. తనను తాను కాపాడుకోడానికి ఇతరులను చంపడం, ఒక కొత్త ప్రపంచాన్ని సష్టించడం.. ఇదే ఈ గేమ్‌‌‌‌ ఆడటానికి ముఖ్య కారణాలు.

ఆండ్రాయిడ్‌‌‌‌ మొబైల్‌‌‌‌లో కొత్త వెర్షన్ డౌన్ లోడ్ చేసుకోవాలంటే 2 జీబీ డేటా అవసరం. అయినప్పటికీ చాలామంది డౌన్లోడ్ చేసుకుంటున్నారంటే ఎంతగా ఎడిక్ట్‌‌‌‌ అయ్యారో అర్థంచేసుకోవచ్చు. ఇప్పుడు ప్రపంచ మార్కెట్‌‌‌‌లో దాదాపు ముప్పై శాతం వాటా గేమింగ్, ఆన్లైన్ యాప్స్ దే. ఇక గేమింగ్ అంతా ఒకెత్తు అయితే ఆన్లైన్ లోనే చిన్నగా బెట్టింగ్ కూడా మొదలైంది. పబ్ జీ టోర్నమెంట్స్, లూడో లాంటి ఆటలలో ఆన్లైన్ పేమెంట్స్ తో చిన్న చిన్న బెట్టింగ్స్ నడుస్తు న్నాయి. అయితే ఇవి ఇప్పుడు అతి తక్కువ మొత్తాలతోనే ఉన్నా ఇంకా ముందు ముందు పెరిగి పోయే చాన్స్ లేకపోలేదు. ఆన్ లైన్ గేమ్స్ నిద్ర లేకుండా చేస్తున్నాయని మరికొందరు వాపోతున్నారు. అలాంటి వాళ్లలో యూత్ ఎక్కువ ఉన్నారు.