అమ్యూజ్‌మెంట్‌‌ పార్కులు తెరవండి

అమ్యూజ్‌మెంట్‌‌ పార్కులు తెరవండి

కోల్‌కతా: అమ్యూజ్‌‌మెంట్ పార్కులు తిరిగి ప్రారంభించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ అమ్యూజ్‌‌మెంట్ పార్క్స్ అండ్ ఇండస్ట్రీస్(ఐఏఏపీఐ) కోరుతోంది.ఈ పార్కు‌‌లపై ప్రభుత్వం ఇంకా ఆంక్షలు కొనసాగిస్తుండటంతో, పెద్ద ఎత్తున నష్టాలు వస్తున్నాయని ఉద్యోగాలు ఊడుతున్నాయని పేర్కొంది. ఈ మేరకు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ఐఏఏపీఐ లేఖ రాసింది. లాక్‌‌డౌన్‌‌తో మార్ చి 15 నుంచి అమ్యూజ్‌‌మెంట్ పార్కు‌లు మూతపడ్డాయని, భారీగా నష్టాలు వస్తున్నాయని తెలిపింది. రామోజీ ఫిల్మ్‌‌ సిటీతో కలిపి దేశ వ్యాప్తంగా ఇలాంటి పార్కులు 150 ఉన్నాయి. ప్రత్యక్షంగానే ఈ పార్క్‌‌లు 80 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయని, పరోక్షంగా మరో 3 లక్షల మం ఈ పార్కులపై ఆధారపడి బతుకుతున్నారని ఐఏఏపీఐ తెలిపింది.