
ఆపరేషన్ సిందూర్ లక్ష్యం పాకిస్తాన్ ను ఆక్రమించుకోవడం కాదని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. భారత్ లక్ష్యం ఉగ్రవాదులు, వారికి మద్ధతు ఇస్తున్నవారేనని అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆపరేషన్ సిందూర్ ప్రారంభించామని చెప్పారు.
సోమవారం (జులై 28) ఆపరేషన్ సిందూర్ పై లోక్ సభలో చర్చ చేపట్టిన సందర్భంగా.. ఆపరేషన్ సిందూర్ పై రాజ్ నాథ్ సింగ్ మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ తో భారత్ సత్తా చాటిందని ఆయన అన్నారు. పహల్గాం దాడిలో అమాయక టూరిస్టులు చనిపోయారని అన్నారు. దీనికి ప్రతీకారంగా పాక్, PoK ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశామని.. ఈ సందర్భంగా సైన్యానికి సెల్యూట్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా.
Also Read:-జమ్మూ కాశ్మీర్లో భారీ ఎన్ కౌంటర్.. పహల్గాం టెర్రర్ ఎటాక్ నిందితులు హతం
రక్షణ మంత్రి స్పీచ్ లోని ముఖ్యంశాలు:
- మన ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే ఊరుకోం
- భారత సైన్యం వ్యూహాత్మకంగా టెర్రరిస్టులపై దాడి చేసింది
- పాకిస్తాన్ లోని 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశాం
- 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టాం
- హిజ్బుల్, లష్కరే తోయిబా స్థావరాలను ధ్వంసం చేశాం
- ఉగ్రవాదుల ఇళ్లల్లోకి చొచ్చుకెళ్లి 22 నిమిషాల్లో వారి స్థావరాలను ధ్వంసం చేశాం
- ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో సైనిక చర్య ప్రారంభించాం
- పాకిస్తాన్ డ్రోన్లను భారత వాయుసేన కూల్చేసింది
- పాక్ దాడుల్లో భారత ఆయుధ సంపత్తికి ఎలాంటి నష్టం జరగలేదు
- నౌకాదళం కూడా పాక్ కు బుద్ధి చెప్పింది.
- స్థావరాలను ధ్వంసం చేసిన తర్వాత.. ఆదేశ DGMO కు సమాచారం ఇచ్చాం
- పాక్ దాడులను సమర్ధవంతంగా తిప్పికొట్టాం
- యుద్ధాన్ని ఆపాలని పాకిస్తాన్ ప్రయత్నించింది.
- ఆపరేషన్ సిందూర్ ముగిసిపోలేదు.. విరామం మాత్రమే ఇచ్చాం
- లక్ష్యాలను సమర్ధవంతంగా ఛేదించాం
- ఆపరేషన్ సిందూర్ ఆపాలని తమపై ఎలాంటి ఒత్తిడి లేదు..