
పద్మారావునగర్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మొన్నటి వరకు ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలతో రాజకీయ వేడిని ప్రత్యర్థులు రగిలించారు. కానీ.. ఆదివారం ఎన్నికల ఫలితాల అనంతరం ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని ఔరా అనిపించారు.
వెస్లీ కాలేజీలో కంటోన్మెంట్ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత బయటకు వెళ్తున్న కాంగ్రెస్అభ్యర్థి వెన్నెల గద్దర్‌కు ఎదురుగా విజేత బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత రాగా పలకరిస్తూ, గెలిచినందుకు నవ్వుతూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిగా వెన్నెలకు లాస్య థ్యాంక్స్ చెప్పి, ఇలా ఫొటోకు ఫోజు ఇచ్చారు.