ఘాజీపూర్ బార్డర్ వద్ద విపక్షాలను అడ్డుకున్నపోలీసులు

ఘాజీపూర్ బార్డర్ వద్ద విపక్షాలను అడ్డుకున్నపోలీసులు

రైతుల ఆందోళనకు తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు విపక్షాల నేతలు. రైతులతో చర్చలు జరిపి వారికి న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రైతుల్ని కలిసేందుకు ఘాజీపూర్ బార్డర్ వెళ్లిన విపక్షాలను అడ్డుకున్నారు పోలీసులు. రైతుల్ని కలవడానికి వారిని అనుమతించలేదు. పార్లమెంటులోనూ రైతుల సమస్యపై మాట్లాడేందుకు తమకు అవకాశం ఇవ్వట్లేదన్నారు ఎంపీలు.

పదిపార్టీల నుంచి 15 మంది విపక్ష ఎంపీలు ఘాజీపూర్ బార్డర్ కు వెళ్లారు. DMK ఎంపీ కనిమొలి, NCP ఎంపీ సుప్రియ సులే, శిరోమణి అకాలీ దల్ ఎంపీ హర్ సిమ్రత్ కౌర్, తృణముల్ ఎంపీ సౌగతారాయ్ తో పాటు ఇతర ఎంపీలు ఘాజీపూర్ బార్డర్ లో పరిస్థితిని పరిశీలించారు. బారికేడ్లు, మేకులు చూస్తుంటే భయమేస్తోందన్నారు విపక్ష ఎంపీలు. రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు.