
చైనా ఆక్రమణలపై రాజ్యసభలో విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. ఈ అంశంపై స్పందించిన మల్లిఖార్జున ఖర్గే.. చైనా భారత భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఈ అంశంపై చర్చకు అనుమతించాల్సిందేనని తేల్చిచెప్పారు.
ప్రతిపక్షాలు తవాంగ్ ఇష్యూపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాయని ఖర్గే తెలిపారు. చర్చకు అనుమతివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే స్పీకర్ చర్చకు అనుమతివ్వకపోవడంతో విపక్షాలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయి.