నేడు ఢిల్లీలో అపోజిషన్ పార్టీల భేటీ

నేడు ఢిల్లీలో అపోజిషన్ పార్టీల భేటీ

కేంద్రంలో బీజేపీని అధికారంలోకి రానివ్వబోమని చెప్తున్న ప్రతిపక్షాలు ఒక్క తాటిపైకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం టీడీపీ చీఫ్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఢిల్లీలో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతిపక్ష పార్టీలను ఈ సమావేశానికి ఆహ్వానించారు. భవిష్యత్​ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది. అంతకు ముందు ఎన్నికల నిర్వహణ తీరుపై ఈసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి సీఈసీకి ఫిర్యాదు చేయనున్నారు. అక్కడే ధర్నా చేపట్టనున్నారు. దాదాపు ఎగ్జిట్​ పోల్స్​ అన్నీ మళ్లీ ఎన్డీయేదే అధికారమని అంచనా వేయడాన్ని  ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. ఈవీఎంలను మానుప్యులేట్​ చేసే కుట్రలో ఇది భాగమని ఆరోపిస్తున్నాయి. 50 శాతం వీవీప్యాట్లను లెక్కించాలని, ఒక్క వీవీప్యాట్​ లెక్కింపులో తేడా వచ్చిన మొత్తం స్లిప్పులు లెక్కించాలని డిమాండ్​ చేస్తున్నాయి. ఈ డిమాండ్లపై మంగళవారం ఎన్నికల కమిషన్​ను ప్రతిపక్షాలు కలువనున్నాయి. ఇందులో భాగంగా చంద్రబాబు నాయుడు  21 పార్టీలను ఆహ్వానించారు. టీడీపీ, కాంగ్రెస్​ సహా పలు పార్టీలు ధర్నాలో, సమావేశంలో పాల్గొననున్నాయి. బీజేపీయేతర కూటమిపై చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నందున వాటిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తోంది.

దీదీతో చంద్రబాబు చర్చలు

సోమవారం అమరావతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎగ్జిట్​ పోల్స్​, ఈసీ తీరుపై ఫైర్​ అయిన చంద్రబాబు నాయుడు.. అనంతరం కోల్​కతా వెళ్లి పశ్చిమబెంగాల్​ సీఎం మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. గంటపాటు ఇద్దరు నేతల సమావేశం కొనసాగింది. ఎగ్జిట్​ పోల్స్, ఈ నెల 23న వెలువడే రిజల్ట్స్​పై వారు చర్చించినట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల తర్వాత అనుసరించాల్సి వ్యూహాలపై వారు సమాలోచనలు జరిపినట్లు సమాచారం.  ఎగ్జిట్​ పోల్స్​ ఎన్ని చెప్తున్నా.. కేంద్రంలో ఎన్డీయేకు మెజారిటీ సీట్లు రావని, ప్రాంతీయ పార్టీలే కీలకమవుతాయని బాబు, దీదీ అంటున్నారు. ఇదే అంశం వారి సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. మంగళవారం చేపట్టే ప్రతిపక్షాల ధర్నాకు, సమావేశానికి రావాలని మమతను ఆహ్వానించినట్లు చంద్రబాబు తెలిపారు. నాలుగురోజుల క్రితం ఆయన ఢిల్లీలో ఆప్​ చీఫ్​ కేజ్రీవాల్​, సీపీఎం జనరల్​ సెక్రటరీ సీతారాం ఏచూరి, సీపీఐ జనరల్​ సెక్రటరీ సురవరం సుధాకర్​రెడ్డి, యూపీఏ చైర్​పర్సన్​ సోనియాగాంధీని, రెండుసార్లు కాంగ్రెస్​ చీఫ్​ రాహుల్​గాంధీని కలిశారు. ఆ తర్వాత లక్నో వెళ్లి ఎస్పీ చీఫ్​ అఖిలేశ్​ యాదవ్​తో, బీఎస్పీ చీఫ్​ మాయావతితో భేటీ అయ్యారు. ఆ నేతలను కలిసినప్పుడు చర్చకు వచ్చిన అంశాలను ఆయన తాజాగా మమతా బెనర్జీతో జరిగిన సమావేశంలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

మాయావతి ఎటువైపో?

బీఎస్పీ చీఫ్ మాయావతి ఎటువైపు వెళ్తా రన్న దానిపై ఇప్పుడు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది . ఉత్తరప్రదేశ్ లో లోక్ సభ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ, ఆర్ ఎల్ డీ కలిసి మహాకూ టమిగా బరిలో కి దిగాయి. ఆ కూటమికి 40 వరకు సీట్లు రావొచ్చని ఎగ్జిట్​ పోల్స్​ అంచనా వేశాయి. బీజేపీకి దూరంగా ఉంటూ వస్తు న్న మహాకూట మి.. యూపీఏకే మద్దతిస్తుందని కాంగ్రెస్ చాలా రోజుల నుంచి నమ్ముతోంది . అయితే, ఎగ్జిట్​ పోల్స్​ రాగానే బీఎస్పీ ప్రవర్తనలో మార్పు వచ్చినట్లు కని పిస్తోంది . సోమవారం ఢిల్లీలో యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాం ధీతోపాటు ఇ తర ప్ర తిప క్ష పార్టీల నాయకులతో మాయావతి భేటీ అవుతారని ఆదివారం వార్తలు వెలువడ్డాయి. అయితే.. సోమవారం తమ చీఫ్ ఎవరితోనూ భేటీ కావడం లేదని బీఎస్పీ సీనియర్ నేత సతీశ్ చంద్ర మిశ్రా మీడియాకు వెల్లడించారు. మాయావతి లక్నోలో నే ఉంటారని ఆయన చెప్పారు. ఉన్నట్టుం డి మాయావతి సోనియాతో సమావేశాన్ని రద్దు చేసుకోవడం చర్చనీయాంశమైంది . లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాలని, ఆ తర్వాతే ఎలాం టి నిర్ణయమైనా తీసుకోవాలని బీఎస్పీ చీఫ్ భావిస్తు న్నట్లు ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి .

ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తేనే?

యూపీలో మహాకూటమికి 40 వరకు సీట్లు వస్తాయని ఎగ్జిట్​ పోల్స్​ అంచనా వేస్తున్నా.. 60కి పైగా సీట్లు వస్తాయని బీఎస్పీ చీఫ్ మాయావతి బలంగా నమ్ముతున్నారు. కేంద్రంలో హంగ్ ఏర్పడితే తామే కీలకంగా మారుతామని ఆమె విశ్వసిస్తు న్నారు. ఈ క్రమంలో ప్రతిపక్షాలన్నిం టితో బీఎస్పీ కలిసి రావాలంటే తననను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని మాయావతి ఓ కండిషన్ పెట్టినట్లు ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది . ఫలితాలకు ముందే ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పాలని, అయితేనే ప్రతిపక్షాల సమావేశాలకు హాజరవుతానని ఆమె అంటున్నట్లు ప్రచారంలో ఉంది. వ్యూహా త్మకంగానే సోమవారం సోనియాగాం ధీతో భేటీని రద్దు చేసుకున్నట్లు సమాచారం. మంగళవారం ఢిల్లీలో చంద్రబాబు చేపట్టే సమావేశం, ధర్నాకు కూడా మాయావతి వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు.