మరో 40 స్టోర్లు తెరుస్తాం.. వెల్లడించిన ఆప్ట్రానిక్స్​

మరో 40 స్టోర్లు  తెరుస్తాం..  వెల్లడించిన ఆప్ట్రానిక్స్​
  • మరో 40 స్టోర్లు  తెరుస్తాం
  • వెల్లడించిన ఆప్ట్రానిక్స్​ 

హైదరాబాద్, వెలుగు : దేశవ్యాప్తంగా 60 స్టోర్లు ఏర్పాటు చేయడం ద్వారా యాపిల్​కు ఇండియాలోనే  అతిపెద్ద రీసెల్లర్​గా ఎదిగామని ఆప్ట్రానిక్స్ ప్రకటించింది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి స్టోర్ల సంఖ్యనున వందుకు చేర్చుతామని, కొత్తగా 40 స్టోర్లను తెరుస్తామని తెలిపింది. 2011లో బేగంపేట్‌‌లో ఒకే స్టోర్‌‌తో ప్రారంభమైన ఆప్ట్రానిక్స్, యాపిల్​ భాగస్వామిగా దేశవ్యాప్తంగా ఎదుగుతోంది.  

ప్రస్తుతం సంస్థకు 20 నగరాల్లో 60 రిటైల్ స్టోర్లు,  16 సర్వీస్ సెంటర్లు ఉన్నాయి.  దేశవ్యాప్తంగా 600 మంది ఉద్యోగులతో  యాపిల్​ ప్రొడక్టులను ఎంతో మందికి చేరువ చేస్తున్నామని ఆప్ట్రానిక్స్​ తెలిపింది. కస్టమర్లు ఎలక్ట్రానిక్​ వేస్ట్​ను పారవేసేందుకు చెన్నైలో ఈ–-వేస్ట్ టవర్‌‌ను ప్రారంభించామని సంస్థ తెలిపింది.